Saturday 7 January 2017

దేవుని ఊరేగింపు (ఊరెరిగింపు)

ఊరేగింపు కాదు ఆ మాట ఊరెరిగింపు. గుళ్ళో ఉండే దేవుడు కూడా ఊళ్ళో వారిని ఆశీర్వదించడానికి బయటికొస్తాడు, అమ్మ వారితో సహా అదే ఇది


పల్లకిలో అమ్మవారు

దేవుని ఊరేగింపులో కాగడా. ఏడమ చేతిలోది కాగడా కుడి చేతిలోది నూనె ’సిద్ది’ (సాధారణంగా ఆముదం)



9 comments:

  1. ఊరేగింపు కరెక్టా ,
    ఊరెరిగింపు కరెక్టా , ఊహింపంగా
    సారీ , శర్మాజీ ! నా
    కారయ తొలిదే కరెక్టుగా కనిపించెన్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు
      ఊరెరిగింపు అన్నమాట వాడుకలో ఊరేగింపయిందని అనుకున్నా! కాదంటే సరి దిద్దుకోడానికే అభ్యంతరం లేదు గాని ఊరేగింపు అనేదెలా సరైనదో వివరించరాదా?

      Delete
    2. గుడి వీడి యూరి వీథుల
      నొడబడి మూర్తులను దీర్చి యూరేగంగా
      వెడలంజేసెడి క్రతువుల
      కడ నూరేగింపనుట నికార్సనిపించున్ .

      ఊరెరిగించుట యనగా
      ఊరి నెరుక పరచు టనెడు నొక పరమార్థం
      బారయనగు శర్మాజీ !
      సారీ , నాయూహ కూడ సరియో కాదో !

      Delete
    3. ఆంధ్రభారతి నిఘంటువులో "ఏగు" అంటే ఉత్సవముతో తిరుగు అన్న అర్థం వుందండి - ఈ కింది ఉదాహరణతో:
      "సీ. మనుచరిత్రం బందుకొనవేళఁ బురమేఁగఁ బల్లకిఁ దన కేలఁ బట్టియెత్తె." (పెద్దన చాటువు.)

      Delete
    4. మీరు చెప్పింది అక్షర సత్యం . ఊరు+ఏగు+ఇంచు-ఊరేగించు-ఊరేగింపు-అనగా
      ఉత్సవ మూర్తులను ఊరిలో ఉత్సవ సమేతంగా తిప్పే ఏర్పాట్లు కావచ్చు .
      ఊరు+ఎరుగు+ఇంచు-ఊరెరిగించు-ఊరెరిగింపు-ఊరిని గురించి తెలియ జెప్పే ఏర్పాట్లు కావచ్చు .

      Delete
    5. Lalitha TSగారు,వెంకట రాజారావు . లక్కాకులగారు,
      నిజానికి ఉన్నదొకటే మాట, నిఘంటువులోనూ, అది ఊరేగింపే!

      ఊరేగింపు అన్నదాని పరమార్థం విషయం ఊరివారికి ఎరిగించడమే!
      ౧.పెళ్ళికూతురు,పెళ్ళికొడుకుని ఊరేగిస్తారు, ఉద్దేశ్యం వీరిద్దరు జాయ,పతి అని ఊరువారు తెలిసికోడానికే!
      ౨. కొంతమంది ఉద్యోగులు తమకు జీతాలు పెంచలేదని ఊరేగింపు చేశారు, విషయం, ఆ యజమాని ఇలా జీతాలు పెంచక ఇబ్బంది పెడుతున్న విషయం ప్రజల దృష్టికి తీసుకు రావడం.
      ౩.దేవుని ఊరేగింపు, ఇదొక లీల. గుళ్ళో కూచున్నాయనకు ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియకపోవడమా! మరి ఊరేగింపు,ఊరెరిగింపు, ఉత్సవం, ఊరు తెలియ జేయదం ఎందుకు? ఇదే అసలు కిటుకు. స్వామివారు,అమ్మవారు గుళ్ళో కూచుంటారు నిత్యమూ! అప్పుడపుడిలా ఊళ్ళో కొచ్చి ఊరి ప్రజల గుమ్మాల ముందుకొచ్చి ఇంటివారిని ఆశీర్వదిస్తారు. స్వామివారు, అమ్మవారు మా ఇంటికొచ్చారని గృహస్తు ఆనందిస్తాడు అదీ సంగతి. ఇలా ఇది ఊరేగింపు,ఊరెరిగింపు కూడా.
      ధన్యవాదాలు.

      Delete
    6. మంచి అవగాహనతో రెంటినీ అనుసంధానించిన మీ విశేషఙ్ఞతకూ , లలిత గారి సారస్వతాభిలాషకూ ధన్యవాదములు .

      Delete
  2. ఊరిలో చేసే ఆరగింపు (నివేదన) కాబట్టి ఊరేగింపు అయిందేమో శర్మ గారూ (సరదాకి అంటున్నాను లెండి, jk, హాహ్హహ్హ 😀). నేను తెలుగు పండితుడను కానే కాను. అలాగే మీకు తెలియదనీ కాదు. "ఊరు + ఏగు + ఇంపు = ఊరిలో తిరిగివచ్చే ఆనందం" అయ్యుండవచ్చేమో కదా.
    మీ ఊళ్ళో కూడా ఫ్లాట్లు వచ్చేసాయా శర్మ గారూ? ఫొటోలో వీధులు చూస్తే అందుకే అలా అనిపించింది. ఫ్లాట్లు ప్రవేశం చేసిన ఊరికి దేవుడే దిక్కు 😕.

    ReplyDelete
    Replies
    1. గారు,
      మా ఊళ్ళో ౧౪ నుంచి ౨౪ అపార్ట్మెంట్లు గల భవనాలు గేటేడ్ కాంప్లెక్స్ లు ఒక ఏభయ్ ఉంటాయి. మా దగ్గరే ఒక పది దాకా ఉన్నాయండి. మమ్మలిని భగవంతుదే రక్షిస్తున్నాడు.
      ధన్యవాదాలు.

      Delete